మహానటి లో డిజిటల్ ఎన్టీఆర్, ఏయన్నార్?

ఈ మధ్య ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కుతున్న నేపథ్యంలో, తెలుగు వారు గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవిత గాధను ప్రస్తుతం వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినిదత్, ప్రియాంకదత్ తెరకెక్కిస్తున్నారు. అయితే దీనిలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషితున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి 29న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

అంతే కాక మరెన్నో ప్రత్యేకతలున్న ఈ చిత్రంలో టీమ్ ప్రస్తుతం అప్పటి ఎన్ టి ఆర్, ఏయన్ఆర్ కలిసి నటించిన సన్నివేశాలను డిజిటల్ రూపంలో చిత్రం లో చేర్చనున్నాని సమాచారం. అదే నిజమైతే తెలుగు ప్రేక్షకులకు ఇక కన్నులపండుగే అని చెప్పాలి. అయితే ఈ సన్నివేశాలు కూర్పు వల్ల చిత్రం పూర్తికావడం కొంత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇందులో ఇంకెన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలియాలంటే విడుదల వరకు వేచి ఉండక తప్పదు. సమంత ఒక ప్రత్యక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.