‘బిగ్ బాస్ 4’లో ప్రముఖ యాంకర్ ?

Published on Jul 13, 2020 6:51 pm IST

బిగ్ బాస్ సీజన్ 4 సన్నాహాలు ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ తెలుగు సినిమాలోని సినీ ప్రముఖులను సంప్రదించే క్రమంలో ఇప్పటికే కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే ప్రతి సంవత్సరం, షోలో యాంకర్ లకు ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. కాగా ఈ సారి, షో కోసం ప్రముఖ యాంకర్ లాస్యను సంప్రదించారు. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, లాస్య ఈ సారి బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కానీ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయినా.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వచ్చిన మూడో సీజన్ మాత్రం బాగానే ఆకట్టుకుంది. మొత్తానికి బుల్లితెర‌ పై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న ఈ రియాలిటీ షో నుండి ఇప్పుడు వస్తోన్న సీజన్ 4 గురించి ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి.

సంబంధిత సమాచారం :

More