రోబో 2 టీంలో జాయిన్ అయిన ఫేమస్ లిరిసిస్ట్

రోబో 2 టీంలో జాయిన్ అయిన ఫేమస్ లిరిసిస్ట్

Published on Sep 29, 2015 9:49 AM IST

Shankar-Rajni-Kanth
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘రోబో’. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ ఆ సినిమాకి దర్శకుడు. శివీజీ, రోబో సినిమాల తర్వాత రజినీకాంత్ – శంకర్ ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న రోబో సినిమాకి సీక్వెల్ గా ‘రోబో 2’ చేయడానికి సిద్దమయ్యారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమా టీంలో రోజుకో క్రేజీ టెక్నీషియన్ వచ్చి చేరుతున్నాడు. తాజాగా మరో ఫేమస్ లిరిసిస్ట్ ని ఈ సినిమా కోసం ఎంపిక చేసారు.

ప్రస్తుతం తమిళంలో స్టార్ లిరిసిస్ట్ మరియు డైలాగ్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న రైటర్ మదన్ కార్కీ. శకర్ రోబో 2 కోసం తనని రైటర్ గా తీసుకున్నాడు. రోబో 2 సినిమాకి మదన్ కార్కీ లిరిసిస్ట్ గానే కాకుండా డైలాగ్స్ కూడా రాయనున్నాడు. ఇటీవలే వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి సినిమాకి డైలాగ్స్ రాసిన మదన్ కార్కీకి మంచి పేరు వచ్చింది. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలి అనుకుంటున్న ఈ సినిమాని ఓ లండన్ బేస్ సంస్థ నిర్మించనుంది. రోబో 2 సినిమాని రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు