ఆ పాట పాడి సర్ప్రైజ్ చేసిన యంగ్ టైగర్!

Published on Mar 23, 2022 2:59 pm IST

దర్శక దిగ్గజం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం ను మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చేస్తోంది. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తారక్‌ని తన స్మార్ట్‌ఫోన్‌లో ఏ పాట ఎక్కువగా ప్లే చేశాడో చెప్పమని హోస్ట్ అడగగా, వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం లోని ఆశ పాశం అని అన్నారు. అంతేకాకుండా, అతను పాట పాడి హోస్ట్‌ను ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ పాడటం తో అభిమానులు తమ ఫేవరేట్ సాంగ్ అంటూ కొందరు చెబుతున్నారు.

అంతేకాక ఎన్టీఆర్ సర్ప్రైజ్ చేసిన విధానం పట్ల వెంకటేష్ మహా ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పాట పట్ల తనకున్న అభిమానానికి తారక్‌కి ధన్యవాదాలు. RRR తో భారీ విజయాన్ని సాధించాలని జూనియర్ ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డివివి దానయ్య భారీ ఎత్తున నిర్మించిన ఆర్ఆర్ఆర్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి MM కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :