అజిత్, అల్లు అర్జున్ ల స్థానంలో చరణ్, ఎన్టీఆర్ ?
Published on Nov 19, 2017 9:41 am IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న హాట్ టాపిక్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ మొదటి స్థానంలో ఉంది. నిన్న సాయంత్రం రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ లతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ హడావుడి మొదలైంది. సినీ వర్గాలు జక్కన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఒక మల్టీ స్టార్ ప్లాన్ చేస్తున్నారని, దాని షూటింగ్ వచ్చేఏడాది మధ్య నుండి మొదలవుతుందని బలంగా చెప్పుకొస్తున్నారు.

ఇప్పుడు తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయాలనుకుంటున్నానని, అందుకు కథను సిద్ధం చేయమని అడిగారట. ఆ మల్టీస్టారర్ లో అజిత్, అల్లు అర్జున్ ను ముందుగా అనుకోగా ఇప్పుడు వారి స్థానంలోకి ఎన్టీఆర్, చరణ్ లు వచ్చారని టాక్ వినబడుతోంది. అంతేగాక ఈ చిత్రంలో ఒక బలమైన సోషల్ మెసేజ్ కూడా ఉంటుందని అంటున్నారు.

మరి ఈ వార్తల్లో ఎంతమేర వాస్తవముందో, ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందో లేదో, ఒకవేళ అయితే ఎప్పటి నుండి మొదలవుతుంది, ఎలా ఉంబడబోతుంది వంటి వివరాలు తెలియాలంటే రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లలో ఎవరో ఒకరు పెదవి విప్పాల్సిందే.

 
Like us on Facebook