ఎన్టీఆర్ మార్పులు కోరాడా ?

Published on Sep 13, 2021 2:35 pm IST


‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న పాన్ ఇండియా మూవీ పై ఇప్పుడు, తాజా అప్‌డేట్ ఏమిటంటే, కొరటాల శివ స్క్రిప్ట్‌ లో ఎన్టీఆర్ కొన్ని కీలక మార్పులు చెప్పారని.. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ లో ఆ మార్పుల పై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇక హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కు జోడీగా కియారాను తీసుకోనున్నారని వార్తలు బలంగా వినిపించాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :