ఎన్టీఆర్ బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 4, 2018 4:00 am IST

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ శరవేగంగా తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మొత్తం 11 పాటలు ఉన్నాయట. ఆ 11 పాటల్లో 4 బిట్ సాంగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ లో సంగీతానికి మంచి ప్రాధాన్యతనే ఇస్తున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన ‘కథానాయకుడు’ నుండి ‘కథానాయక’ అంటూ సాగే టైటిల్ ట్రాక్ కు మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆ సాంగ్ కు మంచి ఆదరణ దక్కుతుంది.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :