ఎన్టీఆర్ కోసం డబ్బింగ్ చెప్పబోతున్న నిత్యామీనన్ !

Published on Oct 28, 2018 10:00 am IST

బాలకృష్ణ ప్రధాన పాత్రగా .. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ బయోపిక్ లో ‘మహానటి’ సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ -సావిత్రి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో కొన్ని క్లాసిక్ చిత్రాలుగా మిగిలిపోయాయి, ఐతే వాటిల్లోని మాయాబజార్, మిస్సమ్మ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ సంఘటనలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఇప్పటికే నిత్యామీనన్ పై చిత్రబృందం ఆ సన్నివేశాల తాలూకు సీన్స్ ను కూడా షూట్ చేశారు.

ఐతే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నిత్యామీనన్ ఈ చిత్రానికి సంబంధించి తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పనుందట. ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :