ఎన్టీఆర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్ !
Published on Sep 23, 2018 12:37 pm IST


నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఇటీవలే అసెంబ్లీ తాలూకు సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుపుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించనుంది. సీనియర్ ఎన్టీఆర్ చైతన్య రథంపై తన చారిత్రాత్మక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీకాకుళంలోనే షూట్ చేయనున్నారు. తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న ‘నందమూరి కళ్యాణ్ రామ్’ కూడా శ్రీకాకుళంలో జరిగే షూట్ లో పాల్గొననున్నాడు.

కాగా దాదాపు కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం 20 రోజులపాటు డేట్స్ ని కేటాయించారు. అయితే ఇటీవలే హరికృష్ణగారు హఠాన్మరణం తర్వాత, ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన పాత్రను ఇంకా పెంచాలని, సీనియర్ ఎన్టీఆర్ కోసం, పార్టీ కోసం, ఆయన చేసిన సేవలను ఈ చిత్రంలో చూపించాలని దర్శకనిర్మాతలు భావిస్తోన్నారు.

ముఖ్యంగా హరికృష్ణగారు తన సినీ కెరీర్ ను త్యాగం చేసి మరీ అనుక్షణం ఎన్టీఆర్ గారిని కనిపెట్టుకొని ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడే రాజకీయంగా ఎదిగే అవకాశం వచ్చినా.. కుటుంబ పాలన చేస్తున్నాడని, తండ్రికి చెడ్డ పేరు వస్తుందని, రాజకీయ పదవులను హరికృష్ణగారు కాదనుకున్నారు. ఇలాంటి కొన్ని అంశాలను ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించనున్నారు.

  • 35
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook