అభిమానుల్ని ఆకాశానికెత్తేసిన తారక్ !
Published on Jun 18, 2017 11:02 am IST


నిన్న సాయంత్రం జరిగిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ తన అభిమానుల్ని ఆకాశానికెత్తేశారు. ఆయన నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న ఎన్టీఆర్ తన అభిమానుల సపోర్ట్ వలన, తన దర్శకుల బాగా ఫోకస్ చేయడం వలన, దేవుడి దయ ఉండటం వలన తాను చాలా లక్కీ అయ్యానని అన్నారు.

అలాగే తనని అభిమానించే అభిమానులకు తానే పెద్ద అభిమానినని అన్నారు. ఎన్టీఆర్ చెప్పిన ఆ మాటలు వినగానే ఫ్యాన్స్ ఉత్సాహం రెండింతలై కేరింతలు కొట్టారు. ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడిగా ఇది రెండవ ఫిల్మ్ ఫేర్ అవార్డు కావడం విశేషం. ఇకపోతే తారక్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ‘జై లవ కుశ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో చిత్రంపై భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.

 
Like us on Facebook