ఇప్పటికీ చెక్కుచెదరనిది మా స్నేహమే : ఎన్టీఆర్
Published on Sep 27, 2016 7:36 pm IST

ntr-rajamouli
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ఓ స్థానాన్నిచ్చిన సినిమా ‘స్టూడెంట్ నెం.1’. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుల్లో ఒకరైన రాజమౌళిని పరిచయం చేసింది కూడా ఈ సినిమాయే! 2001లో సరిగ్గా ఇదే రోజున విడుదలైన ఈ సినిమా నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ సందర్భంగానే అభిమానులంతా స్టూడెంట్ నెం.1 సినిమాను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి సైతం స్టూడెం నెం.1 రోజులను తలుచుకున్నారు.

ఇక వీరితో పాటు ఎన్టీఆర్ కూడా చేరిపోయి స్టూడెంట్ నెం.1 రోజులను గుర్తు చేసుకున్నారు. “అప్పుడే తన సినిమా మొదలుపెట్టిన ఓ కొత్త దర్శకుడి నుండి ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా నిలిచే స్థాయికి వచ్చిన రాజమౌళి పదిహేనేళ్ళ ప్రయాణం. ఓ 19 ఏళ్ళ కుర్రాడి నుండి ఇప్పుడో తండ్రిగా ఎదిగిన నా ప్రయాణం. ఇదంతా ఓ మరచిపోలేని అనుభూతి. ఇన్నేళ్ళలో చెక్కుచెదరినిది మా స్నేహమే!” అంటూ రాజమౌళితో తన స్నేహం గురించి ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సూపర్ హిట్స్ రాగా, మళ్ళీ ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడుంటుందా? అని అభిమానులంతా ఎదురుచూస్తూనే ఉన్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook