‘ఎన్టీఆర్ కథానాయకుడు’ గుంటూరు కలక్షన్స్ !

Published on Jan 10, 2019 10:35 am IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాల మధ్య నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఈచిత్రం అంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో మొదటి రోజు మంచి కలక్షన్స్ ను రాబట్టుకుంది. అక్కడ ఈ చిత్రం 2,03,59,307 వసూళ్లను కలెక్ట్ చేసిందని సమాచారం.

ఇక ఈ చిత్రానికి రెండు షోస్ ఎక్స్ట్రా పడడం బాగా కలిసొచ్చింది. అయితే రేపు , ఎల్లుండి రెండు భారీ చిత్రాలు విడుదలవుతుండడంతో బాక్సాఫిస్ వద్ద ఈచిత్రానికి గట్టి పోటీ ఎదురుకానుంది.

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో విద్యాబాలన్ , సుమంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బాలకృష్ణ , విష్ణు ఇందూరి , సాయి కొర్రపాటి కలిసి నిర్మించారు.

సంబంధిత సమాచారం :