వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్!

Published on Jun 1, 2022 8:30 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీమ్ గా నటించి అందరి మన్ననలు పొందారు. సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో అదే జోష్ లో తదుపరి చిత్రాలు చేసేందుకు సిద్దం అయ్యారు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సింగపూర్ లో ఉన్న ఎన్టీఆర్ TSMBS మాల్‌లో తన స్నేహితులతో కలిసి చిల్ అవుతూ, హల్‌చల్ చేస్తున్న ఫోటో అది. ఎన్టీఆర్ చాలా సింపుల్ గా,స్టైలిష్ గా కనిపిస్తున్నారు ఆ పిక్ లో.

ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేశారు ఎన్టీఆర్. మొదట కొరటాల శివతో తన సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ప్రముఖ యాక్షన్ డ్రామాగా సాగే ఈ సినిమా కోసం స్టార్ హీరో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ ఇంకా లాక్ కాలేదు. ఎన్టీఆర్ చేస్తున్న నెక్స్ట్ చిత్రాల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :