ఎన్టీఆర్, పవన్ ట్వీట్స్ వైరల్ !

ఎన్టీఆర్, పవన్ ట్వీట్స్ వైరల్ !

Published on May 28, 2023 7:14 PM IST

సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ వారి తాతను గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు. ‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా’’ అంటూ.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

అలాగే, సీనియర్ ఎన్టీఆర్ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. ‘‘చరిత మరువని నటనా కౌశలం. తెలుగు నుడికారంపై మమకారం. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్పురణకు ఒకే ఒక పేరు శ్రీ నందమూరి తారక రామారావు గారు’’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు