పులితో ఎన్టీఆర్ ఫైట్.. లీకైన విజువల్స్

Published on Jan 25, 2020 3:00 am IST

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు లీకేజ్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇది వరకే షూటింగ్ లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అవడంతో ఎన్టీఆర్ లుక్ కాస్త రివీల్ అయింది. దీంతో టీమ్ షూటింగ్ లొకేషన్లో పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంది. అయినా సమస్య తగ్గలేదు. తాజాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి బయటికొచ్చింది.

ఈ ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ పోరాట సన్నివేశం సినిమాలోని కీలకమైన అంశాల్లో ఒకటట. ఎంతో ప్రయాసతో దీన్ని తెరకెక్కించారు టీమ్. అలాంటిది ఫైట్లో తారక్ లుక్ బయటికి లీక్ కావడంతో టీమ్ వెంటనే అప్రమత్తమైంది. వెంటనే కాపీ రైట్ ఇష్యూ కింద దానిని ఆన్ లైన్ నుండి తొలగించారు. బయటికొచ్చిన పిక్ చూసిన నెటిజన్లు మాత్రం ఎన్టీఆర్ లుక్ చాలా బాగుందని, తప్పకుండా ఫైట్ సీన్ గొప్పగా ఉంటుందని అంటున్నారు. ఏదిఏమైనా ఇకపై రాజమౌళి ఎండ్ టీమ్ ఇంకాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది.

సంబంధిత సమాచారం :

X
More