గోవా వెళ్లనున్న ఎన్టీఆర్ – పూరి సినిమా..!

గోవా వెళ్లనున్న ఎన్టీఆర్ – పూరి సినిమా..!

Published on Oct 11, 2014 11:54 AM IST

jr-ntr-puri-jaganath
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఎన్టీఆర్ పై డాగ్ హౌస్ లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దానికి ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మూవీ యూనిట్ గోవాకు షిఫ్ట్ అవుతుంది. సినిమాలో మేజర్ పార్ట్ అక్కడే చిత్రీకరించనున్నారు అని సమాచారం.
ఎన్టీఆర్ – కాజల్ అగర్వాల్ జోడి ఈ సినిమాతో హట్రిక్ పై కన్నేశారు. నోర ఫతేహి ఐటెం సాంగ్ లో నటించింది. ఈ సినిమాను 2015 సంక్రాంతికి విడుదల చేయడానికి సినిమా యూనిట్ కష్టపడుతున్నారు. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు