తన చిన్న కుమారుడి పేరును రివీల్ చేసిన తారక్ !

Published on Jul 4, 2018 12:20 pm IST

జూ.ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులు గత కొన్ని రోజుల క్రితమే మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఆ బిడ్డకు నామకరణ మహోత్సవాన్ని నిర్వహించి పేరు పెట్టారు తారక్. ఈ వేడుక ముగియగానే తారక్ ట్విట్టర్ ద్వారా తన కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ బాబుకి పెట్టిన పేరును కూడ రివీల్ చేశారు.

ఇంతకీ తారక్ పెట్టిన ఆ పేరు ఏమిటో తెలుసా.. భార్గవ రామ్. మొదటి కుమారుడు అభయ్ రామ్ పేరులో కూడ తన తాతగారి పేరు వినబడేలా చూసుకున్న జూనియర్ రెండవ కుమారుడికి కూడ రామారవుగారి పేరు వినబడేలా భార్గవ రామ్ అని పేరు పెట్టారు. ఇకపోతే తారక్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :