త్రివిక్రమ్ గురించి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Oct 14, 2018 8:37 pm IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇమేజీకి తగ్గట్లుగా.. పూర్తి స్థాయి ఎమోషనల్ యాక్షన్ సినిమాగా వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. కాగా ఈ సందర్భంగా ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రబృందం హైదరాబాద్‌ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ పై ఆసక్తికార వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ను ఇంతవరకు ఏ హీరో పొగడని విధంగా ఎన్టీఆర్ పొగిడారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు, నా ఆత్మీయుడు, నా శ్రేయోభిలాషి, అన్న, మా అమ్మకు మరో కొడుకు, నా పిల్లలకు మావయ్య, నా భార్యకు అన్న.. ఇలా ఆయన్ని ఎన్ని బంధాలతో పిలిచినా పలికే మిత్రుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయనతో ఒక సినిమా చేయాలి. ఆ సినిమా జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఆ సినిమా నా పిల్లలకు చూపించి గొప్పగా ఫీల్ అవ్వాలి. ఆ సినిమాని సమాజానికి చూపించి.. నేను గర్వంగా నిలబడాలని చాలా బలంగా కోరుకున్నాను. ఆ తరుణం మూడు రోజుల క్రితం రానే వచ్చింది’ అని ఎన్టీఆర్ తెలిపారు.

సంబంధిత సమాచారం :