ఆర్.ఎఫ్.సి లో ఫైట్స్ చేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Nov 26, 2013 8:20 am IST

jr-ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – షాయాజీ షిండే గ్యాంగ్ మధ్య కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2014 సమ్మర్లో విడుదల కానుంది. బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి రభస అనేది వర్కింగ్ టైటిల్., కానీ చివరికి ఈ టైటిల్ మారే అవకాశం ఉంది. ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ – సమంత మూడోసారి తెరపై జంటగా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :