ఎన్టీఆర్ కొత్త లుక్ ఈరోజు సాయంత్రం విడుదలకానుంది !

ఏప్రిల్ 7వ తేది నుంచి ఐపిఎల్ సీజ‌న్ ప్రారంభ‌కానుంది. ఈ క్రికెట్ మ్యాచ్ ప్ర‌సార హ‌క్కుల‌ను స్టార్ స్పోర్స్ట్ ద‌క్కించుకుంది. తెలుగు తరపున ఎన్టీఆర్ ఐపిఎల్ సీజన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో మ్యాచ్‌లకు సంబంధించిన ప్రోమోలను తాజాగా షూట్ చెయ్యడం జరిగింది.

ఈ ప్రోమోలను ఈరోజు సాయన్తరం జరగబోయే ప్రెస్ మీట్లో విడుదల చెయ్యబోతున్నారు. త్రివిక్రమ్ సినిమా కోసం ట్రై చేస్తున్న లుక్ లోనే ఎన్టీఆర్ ఈ ప్రోమోల్లో నటించారు. దీంతో అభిమానులంతా కొత్త లుక్లో ఉన్న తారక్ ఎలా ఉంటారో చూడాలని ఉబలాటపడుతున్నారు. ఈ ప్రోమోలను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు.