‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ లుక్ ఫై వచ్చిన వార్తలు నిజం కాదట !

Published on Dec 5, 2018 12:03 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ తన పాత్ర కోసం బరువు పెరుగుతున్నాడని దానికి సంబందించిన ఫొటో ఒకటి గత రెండు రోజులుగా నెట్ లో హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ వార్తలపై ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ స్పందించాడు. ఎన్టీఆర్ లుక్ గురించి వస్తున్న వార్తలను నమ్మకండి, ఆ ఫొటోలు సంవత్సరం క్రిందటివి ప్రస్తుతం ఆయన లుక్ అది కాదని అని లాయిడ్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో దానయ్య డివివి ఈ చిత్రాన్నినిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం 2020లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :