తానివ్వబోతున్న సప్రైజ్ ఏమిటో రివీల్ చేసిన నాని !
Published on May 24, 2017 1:58 pm IST


హీరో నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హీరో నాని అభిమానులకు ఒక సప్రైజ్ ప్లాన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేమిటంటే ఈ చిత్రంలో తన ఫెవరెట్ పాటైన ‘అడిగా అడిగా’ యొక్క ప్రమోషనల్ వీడియోను ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తామని అన్నారు.

అంతకంటే ముందుగా ఈ పాట యొక్క 20 సెకన్ల టీజర్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నామని చెప్తూ ఈ పాట ప్రేమలో పడ్డవాళ్లకి, పడబోయేవాళ్లకి, పడి బయటపడ్డవాళ్లకి చాలా బాగా నచ్చుతుందని, సింగర్ శ్రీ రామ్ ఈ పాటను అద్భుతంగా పాడారని, విన్న తర్వాత ఆ పాట గొప్పతనమేమిటో మీకే తెలుస్తుందని అన్నారు. మరి నాని చెప్పినట్టు ఈ పాట ఎంత గొప్పగా ఉంటుందో తెలియాలంటే 27 వరకు ఆగాల్సిందే. ఇకపోతే డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేత థామస్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందించారు.

 
Like us on Facebook