భారీ స్థాయిలో విడుదలవుతున్న ‘ఒడియన్’ !

Published on Dec 9, 2018 7:34 pm IST


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’ విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదలకానున్న మొదటి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తో రానున్న ఈ చిత్రం అక్కడ సుమారు 1000 కి పైగా స్క్రీన్ లలో విడుదలకానుంది.

భారీ బడ్జెట్ తో శ్రీకుమార్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. జయచంద్రన్ సంగీతం అందించిన ఈచిత్రం మళయాళంతో పాటు తెలుగు, తమిళం లో డిసెంబర్ 14న విడుదలకానుంది. ఇక ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దగ్గుబాటి రామ్ మరియు సంపత్ కుమార్ ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :