సెన్సార్ గేటు దాటిన ‘ఆఫీసర్’ !

Published on May 29, 2018 3:17 pm IST

వచ్చే శుక్రవారం 1వ తేదీన విడుదలకానున్న సినిమాల్లో అక్కినేని నాగార్జున నటించిన ‘ఆఫీసర్’ కూడ ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే వచ్చే వారానికి ఇదే పెద్ద సినిమా. కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని ముగించుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పట్ల పరిశ్రమలో కొంత ఎక్కువ ఆసక్తే నెలకొని ఉంది. అందుకు కారణం ఆర్జీవీ, నాగార్జునలు ఫలితంపై వ్యక్తపరుస్తున్న నమ్మకమే. వర్మ ఈసారి సినిమాను చాలా శ్రద్దగా, జాగ్రత్తగా తీశానని చెబుతుండగా, నాగార్జున ఈ చిత్రం ఖచ్చితంగా తమ కాంబినేషన్లో మరొక హిట్ చిత్రంగా నిలుస్తుందనే ధీమాతో ఉన్నారు.

మరి ఈ కఠినమైన, యాంగ్రీ పోలీస్ స్టోరీ వర్మ, నాగార్జునలకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇందులోని నాగార్జున పాత్రను కర్ణాటకకు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవితం ఆధారంగా రూపొందించారు వర్మ.

సంబంధిత సమాచారం :