అఫీషియల్ : “2018” ఓటిటి రిలీజ్ పై ఫుల్ క్లారిటీ.!

Published on May 31, 2023 8:03 am IST


లేటెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గర భారీ సక్సెస్ తో వినిపించిన మరో సినిమా పేరు “2018”. టొవినో థామస్ సహా ఎందరో కీలక నటులు ప్రధాన పాత్రల్లో జూడే అంథోని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ సినిమా మళయాళంలో సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకొని సాలిడ్ వసూళ్లు అయితే రాబడుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లోనే సినిమా ఓటిటి రిలీజ్ పై అయితే ఈ సినిమాపై బజ్ వచ్చింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ఉన్న ప్రముఖ సంస్థ సోని లివ్ వారు అయితే ఈ చిత్రాన్ని ఈ జూన్ 7 నుంచే స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారని టాక్ రాగా ఇప్పుడు దీనిపై అఫీషియల్ క్లారిటీ కూడా వచ్చేసింది. సోనీ లైఫ్ వారు అయితే వైరల్ అవుతున్న ఈ జూన్ 7 నే ఒరిజినల్ మళయాళం సహా తెలుగు, తమిళ్, కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దీనితో అయితే ఈ ఎమోషనల్ డ్రామా ఈ జూన్ 7 నుంచి ఆడియెన్స్ ని అలరించనుంది.

సంబంధిత సమాచారం :