కన్ఫర్మ్ : “భీమ్లా నాయక్” వాయిదా..కొత్త రిలీజ్ డేట్ కూడా.!

Published on Dec 21, 2021 10:42 am IST

గత కొన్ని రోజులు నుంచి కూడా టాలీవుడ్ బడా చిత్రాలు అయినటువంటి వాటిలో వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రావడానికి కొన్ని సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ రేస్ లో రెడీగా ఉన్న భారీ సినిమాల్లో ఏదో ఒకటి తప్పకుండ వాయిదా పడుతుంది అని టాక్ వచ్చింది. మరి ఆ సినిమా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “భీమ్లా నాయక్” సినిమానే కావచ్చని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఇప్పుడు దీనిపై ఒక తుది క్లారిటీ ని టాలీవుడ్ నిర్మాతల మండలి ఇచ్చారు. వారిలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తమ సినిమా “ఎఫ్ 3” రిలీజ్ ని ఫిబ్రవరి నుంచి వాయిదా వేసుకున్నామని ఆ డేట్ ఫిబ్రవరి 25న శివరాత్రి సందర్భంగా రిలీజ్ కానుంది అని అలాగే ఎఫ్ 3 సినిమా ఏప్రిల్ కి షిఫ్ట్ చేశామని కన్ఫర్మ్ చేశారు.

దీనితో సంక్రాంతి నుంచి భీమ్లా నాయక్ ను షిఫ్ట్ చేసినందుకు “RRR” మరియు రాధే శ్యామ్ నిర్మాతలు పవన్ కి నిర్మాత నాగవంశీ మరియు త్రివిక్రమ్ లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దీనితో ఎట్టకేలకు భీమ్లా నాయక్ వాయిదా పై ఒక తుది క్లారిటీ వచ్చినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :