అఫీషియల్ : రవితేజ ‘రావణాసుర’ డిజిటల్ రైట్స్ వారికే

Published on Mar 29, 2023 6:01 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రావణాసుర. సుశాంత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో అను ఇమ్మానుయేల్, దక్ష నాగర్కర్, పూజితా పొన్నాడ, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్ గా నటించగా ఈ మూవీని రవితేజ టీమ్ వర్క్స్ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా గ్రాండ్ గా నిర్మించారు.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి. కాగా ఈ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా విషయం ఏమిటంటే, రావణాసుర ఓటిటి రైట్స్ ని ప్రముఖ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. బీమ్స్ సిసిలోరియో, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :