ఇలాంటి ఘటనల ఎదురైతే.. డైరెక్టర్లు తమ కష్టాలను మర్చిపోవచ్చు !

ఇలాంటి ఘటనల ఎదురైతే.. డైరెక్టర్లు తమ కష్టాలను మర్చిపోవచ్చు !

Published on Jul 5, 2019 4:45 PM IST

నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన ‘ఓ బేబీ’ చిత్రం మార్నింగ్ షో నుండే మంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల అంచనాలను అందుకొని మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుంటుంది. అయితే ఈ సినిమా చూసిన పెద్దవాళ్ళు ముఖ్యంగా వృద్ధులు బాగా ఎమోషనల్ అవుతూ.. తమ జీవితాల్లోని సున్నితమైన తమ సమస్యలను అందరికీ అర్ధమయ్యేలా బాగా కనెక్ట్ అయ్యేవిధంగా సినిమాని మలిచినందుకు నందినిరెడ్డి మరియు సమంతల పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

ఇందుకు నిదర్శనంగా ప్రసాద్ ఐమాక్స్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ‘ఓ బేబీ’ మార్నింగ్ షో కి ఈ చిత్ర దర్శకురాలు నందినిరెడ్డి కూడా హాజరయ్యారు. అయితే సినిమా అయిపోయాక, ఆమె అక్కడే ఓ పక్కన కూర్చొని ప్రేక్షకుల రెస్పాన్స్ ను అబ్జర్వ్ చేస్తున్న సమయంలో ఆమె దగ్గరికి సినిమా చూసి వచ్చిన ఓ 70 ఏళ్ల పెద్దాయన .. బాగా ఎమోషనల్ అవుతూ.. ‘మా బాధను, మా ఇన్నర్ ఎమోషన్స్ ను ఫీలింగ్స్ ను, మాలో మాత్రమే మిగిలిపోయే సంఘర్షణను చాలా గొప్పగా చూపించావమ్మా’ అంటూ ఆ పెద్దాయన నందినిరెడ్డి కాళ్లు పట్టుకున్నంత పని చేశాడట. నిజంగా ఒక డైరెక్టర్ కి తమ సినిమాకి సంబంధించి ప్రేక్షకుల నుండి ఇలాంటి స్పందన, ఇలాంటి ఘటనల ఎదురైతే.. ఇక ఆ డైరెక్టర్ ఆ సినిమాకి పడిన కష్టాన్నంతా మర్చిపోవచ్చు.

మొత్తానికి ‘ఓ బేబీ’ సమంత, నందినిరెడ్డిల కెరీర్ ల్లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిపోనుంది. సినిమాలో ప్రధానంగా పేరెంట్స్ ప్రాధాన్యత గురించి విశ్లేషాత్మకంగా చెప్పడం.. సినిమాలో మెయిన్ గా మదర్ ఎమోషన్ని ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాని మలచడంతో ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతున్నారు. కొరియన్ మూవీ ‘మిస్ గ్రాని’కి అనువాదంగా వచ్చిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు