సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన మణిరత్నం వరుసగా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాలు అందుకున్నా ఈ సారి మాత్రం ‘ఓకే బంగారం’తో కచ్చితంగా సూపర్ హిట్ అందుకునేలా ఉన్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకులలో ఏదో తెలియని మేజిక్ ని క్రియేట్ చేస్తోంది. నిన్న రిలీజ్ చేసిన ‘మెంటల్ మదిలో’ సాంగ్ కి అందరి నుంచు యునానిమస్ గా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాలోని మిగతా సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయా అని అంచనాలు పెరిగిపోతున్నాయి.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఎఆర్ రెహమాన్ మ్యూజికల్ ట్రీట్ అయిన ఈ మూవీ మ్యూజిక్ ని మార్చి 27న లాంచ్ చేయనున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, మలయాళ స్టార్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఏప్రిల్ 17న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది. తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు.


