ఓకే బంగారం ఆడియో రిలీజ్ ఎప్పుడంటే..!

ఓకే బంగారం ఆడియో రిలీజ్ ఎప్పుడంటే..!

Published on Mar 31, 2015 6:50 PM IST

ok-bangaram
విభిన్న, విలక్షణ, భావోద్వేగపూరిత సినిమాల ద్వారా దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా నిలిచారు.. మణిరత్నం. ఆయన సినిమాలన్నీ కొత్తగా దర్శకులవ్వాలనుకునే వారికి పాఠాలవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడు గత కొంతకాలం నుంచి తనదైన ముద్ర వేసే సినిమా చేయలేకపోయారు. ఇప్పుడు తాజాగా ‘మణిరత్నం ఇస్ బ్యాక్’ అన్న స్లోగన్ వినపడుతున్న నేపథ్యంలో వస్తోన్న చిత్రం.. ఓకే కన్మణి. తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్‌కి సంబంధించిన విషయం తెలిసింది.

ఏప్రిల్ 4వ తేదీన ఓకే బంగారం తెలుగు, తమిళ ఆడియోను ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఏ. ఆర్. రెహమాన్, మణిరత్నంల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సూపర్ హిట్ ఆల్బంలలానే ఓకే బంగారం ఆడియో ఉండనుందని తెలుస్తోంది. మొత్తం తొమ్మిది పాటలున్న ఈ ఆల్బం మణిరత్నం మార్క్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో ఉందని సమాచారం. తమిళంలో వైరముత్తు ఈ పాటలకు సాహిత్యాన్ని అందించగా, తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ బాధ్యతను నిర్వహించారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది.

తాజా వార్తలు