యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఓంకార్ ‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆయన 2వ సినిమా ‘రాజుగారి గది’ డైరెక్టర్ గా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టినా ఇటీవల చేసిన ‘రాజుగారి గది 2’ మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. అలాగే ఈ మద్య ఈయన హీరో బెల్లం కొండ శ్రీనివాస్ తో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల అది మొదలుకాలేదు.
తాజా సమాచారం మేరకు ఓంకార్ స్టార్ మాలో ఛానెల్లో ఒక రియాలిటి షో చెయ్యడానికి సిద్దవుతున్నట్లు తెలుస్తోంది. భారీగా ప్లాన్ చేసిన ఈ షో కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఈ షోకు సంభందించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.


