స్పెషల్ డేనే 10 మిలియన్ తో రికార్డ్ సెట్ చేసిన ధనుష్.!

Published on Jul 18, 2021 8:16 pm IST

ఒక్క తమిళ ఇండస్ట్రీ లోనే కాకుండా మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గరే తన నటనతో మంచి ఇంపాక్ట్ కలిగించగలిగే అతి తక్కువ మంది స్టార్ హీరోల్లో ధనుష్ కూడా ఒకడు. ధనుష్ హీరోగా ఇప్పుడు అనేక రకాల ప్రాజెక్ట్స్ లో బిజీగా కూడా ఉన్నాడు. అలాగే ధనుష్ కి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజే ఉంది. అయితే తన కెరీర్ లో భారీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో “వి ఐ పి” తెలుగులో “రఘువరన్ బి టెక్” కూడా ఒకటి.

ఈ చిత్రం తమిళ్ లో పెద్ద హిట్ అయ్యింది అలా తెలుగులో డబ్ చేసి ఏ అంచనాలు లేకుండా విడుదలై భారీ లాభాలు తెచ్చి పెట్టింది. మరి ఈ సినిమా ఈరోజుతో 7 సంవత్సరాలు పూర్తి చేసుకోడంతో ధనుష్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే స్పెషల్ రోజునే ధనుష్ ట్విట్టర్ అకౌంట్ కూడా 10 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ దాటి కోలీవుడ్ లోనే మొట్ట మొదట ఈ ఫీట్ సాధించిన హీరోగా రికార్డు సెట్ చేసాడు. ఇలా ఈ రెండు కూడా ఈరోజే కలియడం గమనార్హం.

సంబంధిత సమాచారం :