చివరి దశలో ఆగిన నితిన్ ‘మాస్ట్రో’

Published on Apr 28, 2021 11:00 pm IST

హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో నితిన్ హీరోగా చేస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వీలైనంత త్వరగా చిత్రీకరణను కంప్లీట్ చేయాలనుకుని రంగంలోకి దిగిన నితిన్ టీమ్ అనుకున్నట్టే శరవేగంగా షూటింగ్ జరిపారు.

కానీ ఈలోపు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఇంకొక వారం రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అది జరిగితే సినిమా పూర్తైనట్టే. కరోనా ఉధృతి తగ్గాక షూటింగ్ రీస్టార్ట్ అవుతుంది. ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. నితిన్ కెరీర్లో ఇదే పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం. ఇందులో కథానాయకిగా నభా నటేష్ నటిస్తుండగా ప్రధానమైన నెగెటివ్ పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషిస్తోంది.

సంబంధిత సమాచారం :