ఆ సినిమాలో నటించేది ఒక్క హీరోయిన్ మాత్రమే !
Published on Mar 2, 2018 2:06 pm IST

ర‌వితేజ వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నాడు. గ‌త ఏడాది రాజాదిగ్రేట్‌, ట‌చ్ చేసి చూడు చిత్రాలతో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చిన ఈ హీరో ఈ ఏడాది క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నేల టికెట్, శ్రీను వైట్ల సినిమాలతో రాబోతున్నాడు. నేలటికెట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోజరుగుతోంది. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా శక్తి కాంత్ సంగీతం అందిస్తున్నాడు.

శ్రీను వైట్ల సినిమా షూటింగ్ అధికభాగం అమెరికా లో జరగనుంది. ఈ సినిమాకు అమర్ అక్బర్ అంథోని అనే టైటిల్ ఖరారు చేసారు. మూడు విభిన్న పాత్రల్లో రవితేజ కనిపించబోతున్నాడు. అందుచేత ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అనే వార్తా ప్రచారంలో ఉంది. కాని వాస్తవానికి ఈ సినిమాలో నటించేది ఒక్క హీరోయిన్ మాత్రమేనని సమాచారం.

 
Like us on Facebook