ప్రియా ప్రకాష్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు !

Published on Feb 20, 2019 11:02 am IST

మలయాళ బ్యూటీ, వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ప్రేమికుల రోజున విడుదలైన ఈ చిత్రం పూర్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ బాగాలేదని టాక్ రావడంతో తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ ను మార్చారు. ఈరోజునుండి ఈ చిత్రం యొక్క న్యూ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శింపబడనుంది. ఒమర్ లులు తెరకెక్కించిన ఈచిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందించాడు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలచేయగా ఇక్కడ కూడా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది.

సంబంధిత సమాచారం :