ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సోహెల్ “బూట్ కట్ బాలరాజు”

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సోహెల్ “బూట్ కట్ బాలరాజు”

Published on Feb 23, 2024 1:30 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అలాగే ప్రముఖ యంగ్ హీరో అయినటువంటి సోహెల్ సయ్యద్ రీసెంట్ గా నటించిన చిత్రం “బూట్ కట్ బాలరాజు”. మరి తాను హీరోగా మేఘ లేఖ హీరోయిన్ గా దర్శకుడు కోనేటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ క్కి వచ్చాక సోహెల్ చేసిన పలు ఎమోషనల్ కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో కూడా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు థియేటర్స్ అనంతరం ఈ సినిమా ఓటిటి లో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సినిమా ఓటిటి హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 26 నుంచి అందుబాటులో ఉండనున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రానుంది. మరి ఈ చిత్రాన్ని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడాలి అనుకుంటే చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా ఎండి పాషా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు