ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి, కత్రినా “మేరీ క్రిస్మస్”

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి, కత్రినా “మేరీ క్రిస్మస్”

Published on Mar 7, 2024 1:08 PM IST

Merry Christmas

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మేరీ క్రిస్మస్”. మరి ఈ చిత్రం రీసెంట్ గానే పాన్ ఇండియా భాషల్లో సంక్రాంత్రి రేస్ లో రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇందులో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

మరి ఇందులో ఈ మార్చ్ 8 నుంచి అయితే ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి హిందీ సహా తమిళ్ లో మాత్రమే ఉండనుంది. మరి మిగతా భాషలకి సంబంధించి అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా టిప్స్ నిర్మాణ సంస్థ అలాగే మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే సంజయ్ కపూర్, ప్రతిమ కన్నన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు