ఓటిటిలో “లవ్ టుడే” రిలీజ్ కి డేట్స్ ఫిక్స్.!

ఓటిటిలో “లవ్ టుడే” రిలీజ్ కి డేట్స్ ఫిక్స్.!

Published on Nov 27, 2022 3:30 PM IST

లేటెస్ట్ కోలీవుడ్ మరియు మన టాలీవుడ్ దగ్గర కూడా వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నటువంటి చిత్రం “లవ్ టుడే”. తమిళ నాట ఆల్రెడీ భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి టాక్ ని సంతరించుకుంది. ఇక హీరో అండ్ దర్శకునిగా యంగ్ ఫిల్మ్ మేకర్ ప్రదీప్ ఈ చిత్రానికి వర్క్ చెయ్యగా ఇవానా హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ చిత్రం అయితే ప్రస్తుతం థియేటర్స్ లో మంచి రన్ తో కొనసాగుతుండగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ లో తమిళ్ మరియు తెలుగు భాషల స్ట్రీమింగ్ డేట్స్ ఇప్పుడు ఫైనల్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి తమిళ్ లో అయితే ఈ చిత్రం ఈ డిసెంబర్ 2 నుంచే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుండగా తెలుగులో అయితే డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ రెండు డేట్స్ లో అయితే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు