డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఐషు ‘భూమిక’ చిత్రం.!

Published on Aug 21, 2021 1:00 pm IST

యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో వస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “భూమిక”. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్స్ పై కార్తికేయ సంతానం, సుదాన్ సుందరం, జయరామన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రథింద్రన్ ఆర్ ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఓటీవల ఓటిటిలో పలు చిత్రాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి రెడీ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఈ ఆగష్టు 23న నెట్ ఫిక్స్ లో నేరుగా విడుదల కావడానికి రెడీ అయ్యింది. తమ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు భూమిక మరింత ఆకట్టుకోవడం ఖాయం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

ఇక ఈ చిత్రానికి టెక్నికల్ టీం: దర్శకుడు: రథింద్రన్ ఆర్ ప్రసాద్, నిర్మాతలు: కార్తికేయ సంతానం, సుదాన్ సుందరం, జయరామన్, బ్యానర్స్: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, ప్యాషన్ స్టూడియోస్, సమర్పణ: కార్తీక్ సుబ్బరాజ్, పీఆర్వో: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్ లు వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :