వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జాతి రత్నాలు… బుల్లితెర పై సత్తా చాటేనా?

Published on Aug 20, 2021 3:22 pm IST

నవీన్ పోలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, కీర్తీ సురేష్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందం, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్ లు కీలక పాత్రల్లో నటించిన చిత్రం జాతి రత్నాలు. ఈ చిత్రానికి అనుడీప్ దర్శకత్వం వహించారు. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో సైతం భారీ వ్యూస్ ను కొల్లగొట్టింది.

అయితే ఈ చిత్రం బుల్లితెర పై వరల్డ్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 22 వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు జెమిని టీవీ లో ప్రసారం కానుంది. రొమాంటిక్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం బుల్లితెర పై సైతం అదే రేంజ్ లో సత్తా చాటేందుకు సిద్దం అయింది.

సంబంధిత సమాచారం :