మా చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి – నాగార్జున


అక్కినేని నాగార్జున ఒకవైపు నటుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాతగా విలువలు కలిగిన చిత్రాలని నిర్మిస్తూ తన శైలిని చాటుకుంటున్నారు. అన్నపూర్ణ స్యుడియోస్ బ్యానర్ నుండి వచ్చే ప్రతి చిత్రం కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యేదిగా ఉండాలని భావించే ఆయన ఈ సంక్రాంతికి ‘రంగుల రాట్నం’ ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈరోజే విడుదలకానున్న ఈ చిత్రంలో తల్లి, కొడుకులు సెంటిమెంట్, అమ్మాయి, అబ్బాయిల మధ్య ఉండే ప్రేమ, స్నేహం వంటి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియోస్ వారు వడ్డిస్తున్న కమ్మనైన బొబ్బట్టులాంటిది అన్నారు. రాజ్ తరుణ్, చిత్రా శుక్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకురాలు శ్రీరంజని డైరెక్ట్ చేశారు.