బాలీవుడ్లో విరిసిన పద్మాలు

Published on Jan 26, 2020 3:48 pm IST

గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71పద్మా అవార్డుల్లో అన్ని రంగాలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే సినీ రంగం నుండి ఎంపికైన నలుగురు సెలబ్రిటీలు బాలీవుడ్ నుండే ఉన్నారు. వారిలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు, వ్యాఖ్యాత కరణ్ జోహార్ ఉండగా ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ కూడా పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఇక పద్మా పురస్కారాలు పొందిన ఇంకో ఇద్దరూ మహిళలే కావడం విశేషం. వారిలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఒకరు. స్త్రీవాదిగా పేరు తెచ్చుకుని, లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కంగనా అంటే ధైర్యానికి నిలువెత్తు చిహ్నం అంటుంటారు. ఇక పురస్కారానికి ఎంపికైన మరొక సెలబ్రిటీ ఏక్తా కపూర్. బాలీవుడ్లో టెలివిజన్ టైకూన్ అనే బిరుదు పొందిన ఏక్తా కపూర్ నిర్మాతగా అనేక టీవీ సీరియళ్లు, షోలు నిర్మించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More