“పక్కా కమర్షియల్” టైటిల్ ట్రాక్ వచ్చేసింది..!

Published on Feb 3, 2022 1:01 am IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పక్కా కమర్షియల్”. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖ‌న్నా హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే నేడు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించిన చిత్రం బృందం, తాజాగా ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసింది.

సిరివెన్నెల గారు ఆఖరి రోజుల్లో రాసిన ఈ పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రతిదీ కమర్షియలే అంటూ రాసిన ఈ టైటిల్ ట్రాక్‌లో సిరివెన్నెల మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. స్వీయ సంగీత దర్శకత్వంలో జాక్స్ బెజోయ్, హేమ చంద్ర కలిసి ఈ పాటను పాడారు. ఇకపోతే ఈ సినిమా మే 20న విడుదల కాబోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :