“పంచతంత్రం” టీజర్‌ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే?

Published on Oct 8, 2021 1:35 am IST


హాస్యనటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ పదిలమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న బ్రహ్మానందం తాజాగా ‘పంచతంత్రం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హర్ష పులిపాక ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం వేద‌వ్యాస్ పాత్రలో క‌నిపించ‌బోతుండగా ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదిన ఉదయం 11:11 గంటలకు ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సముద్రఖని, స్వాతి రెడ్డి, యువ హీరో రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :