తెలుగు యువ హీరోల్లో యాక్టింగ్ విషయంలో, డ్యాన్స్ విషయంలో రామ్‌కి మంచి పేరుంది. తన గత చిత్రాలైన ఒంగోలు గిత్త, మసాలా లాంటి సినిమాలు అనుకున్న రేంజ్‌లో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని, వరుస సినిమాలతో మన ముందుకు రానున్నాడు రామ్. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పండగ చేస్కో’ చివరి దశకు చేరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఫారిన్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్న టీమ్ తిరిగి హైద్రాబాద్ ప్రయాణమైంది. ఈ షెడ్యూల్‌తో దాదాపుగా సినిమా షూటింగ్ ముగిసినట్టేనని సమాచారం.
ఇక రామ్ గత నెలలో మొదలుపెట్టిన ‘శివం’ రెండో షెడ్యూల్ త్వరలో మొదలవనుంది. ఈ సినిమాతో శ్రీనివాస్ రెడ్డి అనే కొత్త దర్శకుడు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నాడు. స్రవంతీ మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇవేకాక ‘హరికథ’ అనే చిత్రంలో రామ్ నటించనున్నాడు. సెకండ్ హ్యాండ్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కిషోర్ ఈ ‘హరికథ’కు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇక పండగ చేస్కో సినిమాని ఈ వేసవిలోనే విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.


