టీజర్ రిలీజ్ కి సిద్ధమైన పంజా వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’

Published on Jun 24, 2022 7:57 pm IST

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలిసారిగా ఉప్పెన మూవీతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన మూవీతో సూపర్ హిట్ కొట్టడంతో పాటు అందులో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్. అనంతరం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం మూవీ కూడా వైష్ణవ్ కి విజయాన్ని అందించింది. అనంతరం ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా సినిమా రంగరంగ వైభవంగా. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇటీవల హీరో, హీరోయిన్స్ ఇద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన యూనిట్, త్వరలో టీజర్ ని విడుదల చేయనుంది. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం టీజర్ రిలీజ్ కి సంబంధించి వెరైటీగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ పిక్ తో సగం పోస్టర్ ని రిలీజ్ చేసిన యూనిట్, మిగతా సగం పోస్టర్ కోసం త్వరలో హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి అంటూ పోస్ట్ చేసింది. రొమాంటిక్ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ తప్పకుండా హీరోగా వైష్ణవ్ తేజ్ కి మంచి బ్రేక్ ని ఇస్తుందని, అలానే దర్శకుడు గిరీశాయ అందరినీ అలరించేలా ఈ రంగరంగ వైభవంగా మూవీనిే ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం :