డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “పరేషాన్”

Published on Jun 2, 2023 11:46 am IST

మసూదా ఫేమ్ తిరువీర్ నటించిన కొత్త చిత్రం, పరేషాన్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పావని కరణం కథానాయికగా నటించింది. తాజా సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను లాక్ చేసినట్లు సమాచారం.

ఈ కామెడీ ఎంటర్టైనర్ డిజిటల్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్ సంగీతం సమకూర్చగా, వాల్తేరు ప్రొడక్షన్స్‌ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన పరేషాన్‌లో బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెరా ఖాన్, రవి మరియు రాజు బేడిగల కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :