ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ సెన్సేషన్ “పార్కింగ్”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ సెన్సేషన్ “పార్కింగ్”

Published on Dec 30, 2023 7:06 AM IST

రీసెంట్ గా తమిళ నాట పెద్ద హిట్ అయ్యిన చిన్న సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు హరీష్ కళ్యాణ్ అలాగే సీనియర్ నటుడు ఎం ఎస్ భాస్కర్ లు నటించిన చిత్రం “పార్కింగ్” కూడా ఒకటి. దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు జెనరేషన్ ల మధ్య ఈగో నేపథ్యంలో వచ్చింది. మరి తమిళ నాట చాలా పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమా మూవీ లవర్స్ లో గట్టిగానే వినిపించింది.

అయితే ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ + హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా అందులో ఈ సినిమా నేటి నుంచి తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో వచ్చేసింది. మరి తెలుగులో కూడా చూడాలి అనుకునేవారు ఈ సినిమాని ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా సుధన్ సుందరం నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు