టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “పార్కింగ్”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “పార్కింగ్”

Published on May 24, 2024 1:00 AM IST

హరీష్ కళ్యాణ్ హీరోగా, బిగిల్ ఫేమ్ ఇందుజా రవిచంద్రన్ హీరోయిన్ గా, డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పార్కింగ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకోగా, ఈ శనివారం సాయంత్రం 4:00 గంటలకు ప్రసారం కానుంది. ఎం.ఎస్ భాస్కర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ మరియు సోల్జర్ ఫ్యాక్టరీ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు