వరల్డ్ వైడ్ “పఠాన్” 4వ రోజు కూడా రికార్డు స్థాయి వసూళ్లు.!

Published on Jan 29, 2023 4:00 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “పఠాన్”. షారుఖ్ ఖాన్ నుంచి ఓ కం బ్యాక్ అందుకోవాలని చూస్తున్న వారికే కాకుండా బాగా డ్రై అయ్యిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీ కి కూడా భారీ జంప్ ఇస్తూ సెన్సేషనల్ ఓపెనింగ్స్ పఠాన్ చిత్రం నమోదు చేస్తుంది.

మరి హిందీలో అయితే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఆల్ టైం లెవెల్లో సెట్ చేస్తూ ఉండగా ఇక హిందీలో ఈ శనివారం ఏకంగా 51.50 కోట్ల గ్రాస్ ని అందుకోగా జస్ట్ ఈ నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం హిందీ మార్కెట్ లో 200 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇక వరల్డ్ వైడ్ కూడా ఈ చిత్రం అదే సెన్సేషన్ ని కొనసాగిస్తూ మొత్తం నాలుగు రోజుల్లో ఏకంగా 429 కోట్ల భారీ వసూళ్లతో సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తోంది. ఇలా ఈ చిత్రం మరిన్ని రికార్డులు సెట్ చేసేందుకు దూసుకెళ్తుంది.

సంబంధిత సమాచారం :